భారతీయ బ్యాంకులకు వేలకు వేల కోట్లు రుణాలు ఎగవేసిన విజయమాల్య ప్రస్తుతం లండన్ లో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.దివాలా చర్యల్లో భాగంగా కోర్టులో ఆస్తులను జప్తు చేయడం వల్ల తన వ్యయాలు, కోర్టు ఖర్చులకోసం నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లు మాల్య స్వయంగా తెలిపారు. ఈ మేరకు కొద్దిగా నిధులు పొందేందుకు అనుమతించాలని బ్రిటన్ హైకోర్టును కోరగా ఖర్చులకోసం 2.3 కోట్లు తీసుకునేందుకు న్యాయస్థానం ఓకే చెప్పింది