ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్క ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. జనవరి 9 అంటే వచ్చే నెల 9వ తేదీ నుంచి అమ్మ ఒడి రెండో విడత చెల్లింపులు చేయనున్నామని అక్కడి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బాబు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. తాజా సమాచారం మేరకు ఈనెల 10 నుంచి 20 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్ జరగనున్నాయి. అలాగే ఈనెల 16 నుంచి 19 వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శించనున్నారు. అలాగే 20 నుంచి 24 దాకా ప్రకటించిన జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే వాటికి సవరణలు చేయనున్నారు.
అలాగే ఈ నెల 26వ తారీఖున అమ్మ ఒడి లబ్ధిదారుల ఫైనలిస్టు ప్రదర్శిస్తామని ఏపీ మంత్రి సురేష్ బాబు ప్రకటించారు. పూర్తి పారదర్శకంగా అమ్మ ఒడి పథకం లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి పథకం వర్తింపు చేస్తామని అన్నారు. గత ఏడాది 43 లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల మంది లబ్ధిదారులకు వర్తింప చేశామని అలాగే గత ఏడాది 6336 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని ఆయన ప్రకటించారు. ఈనెల 31న జాబితాపై ఆమోద ముద్ర వేస్తారని ఆయన ప్రకటించారు.