శివుణ్ని చూపిస్తానంటున్న నిత్యానంద..కైలాసా దేశానా కథ వేరే ఉందా..?

-

కైలాస్‌ రండి..పరమశివుణ్ని డైరెక్టుగా చూపిస్తానంటున్నాడు నిత్యానంద. దేశం విడిచి పారిపోయిన స్వామివారు మళ్లీ కొత్త జిమ్మిక్కులు మొదలు పెట్టారు. శివుడి దర్శనం పేరుతో కైలాస్‌ టూర్‌ ప్యాకేజీని ప్రకటించాడు. ఏకంగా శివుణ్నే చూపిస్తా..రా రమ్మని పిలుస్తున్నాడు. తనకు తాను సొంతంగా కైలాస దేశాన్ని ప్రకటించుకున్న నిత్యానంద మళ్లీ హైలెట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.

శివుణ్ని చూడాలంటే కైలాస దేశానికి రావాలంటూ భక్తులకు ఓ ఆఫర్‌ ఇచ్చాడు… వివాదాస్పద స్వామీజీ నిత్యానంద . రెండు రాత్రులు, మూడు పగళ్లు తన దేశంలో ఉండే భాగ్యం కల్పిస్తానని… ఈ అవకాశం పొందాలంటే ముందు వీసాకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాడు. భక్తులు సొంత ఖర్చులతో ఆస్ట్రేలియాకు వస్తే… అక్కడి నుంచి కైలాస దేశానికి చార్టెడ్‌ ఫ్లైట్స్‌ అందుబాటులో ఉంటాయని చెప్పాడు నిత్యానంద.

ఈ-మెయిల్‌ ద్వారా కైలాస దేశానికి వీసా కోసం అప్లై చేసుకోవాలని సూచిస్తున్నాడు… నిత్యానంద. తన దగ్గరికి వస్తే డైరెక్ట్‌గా పరమశివుణ్నే చూపిస్తానంటూ ప్రచారం ప్రారంభించాడు. అంతేకాదు… రెండు రాత్రులు, మూడు పగళ్లు కైలాస దేశంలో ఉండేలా స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటించాడు. నిత్యానంద శివుణ్ని చూపిస్తాడో? లేక ఇంకేమైనా చూపిస్తాడో అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news