ఆ ఇంటిలో క్షుద్ర పూజలు.. మైనర్ బాలిక మిస్సింగ్.. అసలేమైంది ?

-

ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఒక గ్రామంలో గుప్త  నిదుల కోసం తవ్వకాలు జరుపగా అదే కుటుంబానికి చెందిన ఓ మైనర్ యువతి అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన నరసింహా రావు ఇంటిలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరిగాయి. గత కొంత కాలంగా ఈ త్రవ్వకాలు సాగుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఇంటిలో పెద్ద గొయ్యిని తవ్వారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి ఇంటికి వెళ్లే సరికి గుప్త నిదుల ఆనవాళ్లు లేకుండా చేశారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి, ఇంటి వైపు వెళ్లకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయితే నరసింహారావు మేనకోడలు రాజేశ్రీ హైదరాబాద్ లో చదువుతుంది.

అయితే ఇప్పుడు ఆ బాలిక కనిపించకుండా పోయింది. తనకు చదువుకోవాలని ఉంది అని చెబుతూ ఆ బాలిక లెటర్ రాసి మూడు రోజుల క్రితం బయటకు వెళ్లి పోయింది. ఆ బాలిక ఆచూకి కనిపించడం లేదు. అసలు ఆ బాలిక ఏమైంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత నాలుగు రోజుల నుంచి బెంగుళూర్ నుంచి ఒకరు వచ్చి గుప్త నిదుల కోసం పూజలు చేస్తున్నారని గ్రామంలో ప్రచారం ఉంది. నిధుల తవ్వకానికి బాలిక మాయం కావడానికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల నిధుల కోసం బలి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది ఏమైనా జరిగిందా అనేది అనుమానాస్పదంగా మారింది. 

 

Read more RELATED
Recommended to you

Latest news