భాగ్యనగరానికి బుల్లెట్‌ రైలు..?

-

నేషనల్‌ రైల్‌ప్లాన్‌లో భాగ్యనగరానికి సముచితస్థానం దొరికింది. హైదరాబాద్‌బెంగళూరు, ముంబయి హైదరాబాద్‌లకు హైస్పీడ్‌రైల్‌ను నడిపేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 2,398 కిలోమీటర్లకు సంబంధించిన ప్రణాళికను(రూ. 38,20,516కోట్ల అంచనా) రైల్వేబోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ విడుదల చేశారు.11 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన రైల్వేశాఖ హైదరాబాద్‌ – నాగ్‌పూర్, హైదరాబాద్‌ – బెంగళూర్, హైదరాబాద్‌ – వరంగల్‌ ఉన్నావి.

 

ఉపాధి అవకాశాలు మెండు..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగాం ద్వారా స్మార్ట్‌ సిటీల మాదిరిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. భారత్‌లోని ప్రాముఖ్యమున్న నగరల్లో ముందు తరాలకు అవసరమయ్యేలా తిర్చిదిద్దనుంది. తయారీ, పెట్టుబడుల పరంగా 11 పారిశ్రామి కారిడార్ల మధ్య 30 ప్రాధాన్యమున్న ప్రాజెక్టులను నిర్మిస్తే అభివృద్ధితో పాటు, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని రైల్వేశాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news