ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లకు ఆమోదం

-

ఐపీఎల్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్. ఐపీఎల్ కోసం మరో రెండు జట్లకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లో రెండు కొత్త జట్లకు చేర్చడానికి బీసీసీఐ ఆమోదం తెలిపింది. యీ వచ్చే ఏడాది కాకుండా 2022 ఐపీఎల్ సీజన్ 10 జట్లతో నిర్వహించేలా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

2021 సీజన్ నుంచే 10 జట్లతో ఐపీఎల్ జరపాలని కొందరు సభ్యులు ప్రతిపాదించినా, ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి ఇప్పుడు రెండు కొత్త జట్లకు బిడ్డింగ్ లు పిలవాల్సి ఉండడంతో ఇప్పటికిప్పుడు నూతన ఫ్రాంచైజీలను హడావిడిగా నిర్ణయించలేమని బోర్డు యాజమాన్యం పేర్కొంది. ఇక, క్రికెట్ ను 2028 ఒలింపిక్స్ లో కూడా చేర్చాలన్న ఐసీసీ నిర్ణయానికి సూత్రప్రాయం గా మద్దతు పలకాలని సమావేశంలో నిర్ణయించారు. ముందుగా, ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశం విధి విధానాలపై ఐసీసీ నుంచి తగిన స్పష్టత కోరాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news