సాధారణంగా తాటి చెట్టు నుంచి కల్లు వస్తుంది. వేప చెట్టు నుంచి వేప కల్లు వస్తుంది. అది పెద్ద విశేషమేమీ కాదు కానీ.. వేప చెట్టు నుంచి పాలు వస్తే.. అది కదా విశేషం అంటారా? అవును.. అక్కడ వేప చెట్టు నుంచి పాలు వస్తున్నాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లాకు సమీపంలో ఉన్న కోయనార్ అనే ఊళ్లోనే ఈ వింత జరుగుతుంది. అక్కడ ఉన్న ఓ వేప చెట్టు నుంచి గత కొంత కాలంలో పాలలాగా తెల్లగా ఉండే ఓ ద్రవం బయటికి రావడాన్ని అక్కడి స్థానికులు గమనించారు. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలియడంతో.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా వేప పాలు చూడటానికి తండోపతండాలుగా ఆ వేప చెట్టు వద్దకు తరలివస్తున్నారు.
మరికొంతమంది ఆ చెట్టుకు పూజలు నిర్వహించి ఆ పాలను గ్లాసులో పట్టుకొని తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇది భగవంతుడి మహత్తు అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ ఊరి పెద్దలంతా కలిసి వేప చెట్టు దగ్గర దేవుడి గుడి నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. అసలు వేపచెట్టు నుంచి పాలు ఎలా వస్తున్నాయి.. అనే విషయం మాత్రం వాళ్లకు అర్థం కావడం లేదు. నిజంగా ఇది దేవుడి మహత్తా లేక అందులో ఏదైనా సైన్సు దాగుందా? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. మీకేమైనా తట్టిందా?