గ్రేటర్ : బీజేపీ కార్పొరేటర్ ను మింగేసిన కరోనా

-

గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. న్యూ ఇయర్ సమీపిస్తున్న సమయంలో అందరూ ఆ వేడుకల్లో మునిగిపోగా బీజేపీ శ్రేణుల్లో మాత్రం విషాదం నెలకొంది. తాజాగా మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో లింగోజీగూడ బీజేపీ కార్పొరేటర్ గా ఎన్నికైన రమేష్ గౌడ్ కరోనా కారణంగా కన్ను మూశారు. మొన్న జరిగిన హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆకుల రమేష్ గౌడ్‌.. తన సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ నేత ముద్రబోయిన శ్రీనివాసరావుపై 2811 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

అయితే, విజయం సాధించిన మూడు రోజులకే ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పటి నుండే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేరిన రమేష్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఇక, బీజేపీలో కీలక నేతగా ఉన్న రమేష్‌గౌడ్ గతంలో ఎల్బీనగర్‌ మున్సిపల్ చైర్మన్‌గా కూడా పని చేశారు.  

Read more RELATED
Recommended to you

Latest news