సందర్శకులను ఆకట్టుకునే కొండకర్ల ఆవ ప్రత్యేకత ఇదే..!

-

ఓ పక్క సరస్సు … రంగు రంగుల పక్షులు… అందమైన పువ్వులు… అబ్బా అలా ఆ పడవ మీద వెళ్తుంటే ఎంతో మజాగా ఉంటుంది. నిజంగా ఈ ప్రదేశం లో మాయ దాగి ఉంది. అక్కడ ప్రకృతిని కనుక చూశారంటే వదిలి పెట్టలేరు. అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఇటువంటి అందమైన ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా…? మరి ఇక ఆలస్యం చేయకండి పూర్తిగా చూసేయండి.

కొండకర్ల ఆవ కొల్లేరు సరస్సు తర్వాత రెండవ పెద్ద మంచి నీటి సరస్సు. కొండలు, కొబ్బరి చెట్లు ఆవకు ప్రత్యేక అందాన్ని చేకూర్చుతున్నాయి. ఈ ప్రదేశం ఎక్కడ ఉంది..? ఈ విషయం లోకి వస్తే… కొండకర్ల విశాఖపట్నం జిల్లా, అచ్యుతాపురం మండలానికి చెందినది. ఈ కొండకర్ల వద్ద ఉన్న ఆ ఒక పెద్ద మంచి నీటి సరస్సునే “కొండకర్ల ఆవ”గా పిలుస్తారు. డిసెంబరు నెలలో సైబీరియా మొదలగు అనేక దేశాల నుండి పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. ఇది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణీయం.

ఫ్రెంచి వారు ఆవకు సమీపం లో ‘ప్రెంచ్ భవనాన్ని’ నిర్మించారు. అయితే స్వాతంత్య్రం రాక ముందు విజయనగరం మహా రాజులు రెఫ్రెషమెంట్ కోసం ఇక్కడకు వచ్చేవారు. ఇది ఇలా ఉండగా ఈ ఆవకి మరో ప్రత్యేకత ఉంది అది ఏమిటంటే..? ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు. చిన్న చిన్న సినిమాలని కూడా ఇక్కడ చిత్రించుకుంటారు. అలా సరస్సు లో పడవ లో వెళ్తూ ఉంటె ఎంతో ఆనందం కలుగుతుంది. అది నిజంగా మంచి మధుర జ్ఞాపకంలా మారిపోతుంది కదా…!

Read more RELATED
Recommended to you

Latest news