కన్నుకొట్టిన పాప పాట పాడుతోంది.. ప్రియా ప్రకాష్ వాఇయర్ తెలుగు ఎంట్రీ..

-

కన్ను కొట్టి ఫేమస్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రమే అని చెప్పాలి. లవర్స్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ భామ, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. పమళయాళీ అమ్మాయైన ఈ అమ్మడి చేతిలో చాలానే సినిమాలున్నాయి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న చెక్ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తుంది. ఇందులో నితిన్ సరసన రకుల్ ప్రీత్, కథానాయికగా చేస్తుంది.

హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రియా ప్రకాష్ వారియర్, సింగర్ గా తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధం అవుతుంది. తెలుగు సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకత్వంలో రూపొండుతున్న ఒకానొక పాటను ఆలపించడానికి తయారవుతోంది. ఈ ఆల్బమ్ సినిమాకి చెందింది కాకపోవడం గమనార్హం. మరి కన్ను కొట్టి ఫేమస్ అయిన ఈ భామ, తన పాటతో ఎలా అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news