కోలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ 20 ఏళ్ల తర్వాత కుదురుతుంది. కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్ తమిళ హీరో అజిత్ కలిసి సినిమా చేయబోతున్నారు. మురుగదాస్ తొలి సినిమా దీనలో అజిత్ హీరోగా చేశాడు. 2001లో వచ్చిన ఆ సినిమా పెద్ద విజయం అందుకుంది. దర్శకుడిగా మురుగదాస్ మొదటి సినిమాతోనే సత్తా చాటాడు. ఆ సినిమాతోనే అజిత్ మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు.
ఇక దీన తర్వాత రమణ, కత్తి, సర్కార్ ఇలా వరుస సినిమాలతో మురుగదాస్ క్రేజీ డైరక్టర్ గా మారిపోయాడు. తమిలంలోనే కాదు తెలుగు, హింది భాషల్లో కూడా మురుగదాస్ సినిమాలు చేశాడు. సర్కార్ తర్వాత రజినికాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్న మురుగదాస్ ఆ సినిమా తర్వాత 2020లో అజిత్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట.
అజిత్ తో తీసిన దీనతో దర్శకుడిగా మారిన మురుగదాస్ మళ్లీ 20 ఏళ్ల తర్వాత అతనితో సినిమా చేస్తున్నాడు. తల అజిత్ కూడా విశ్వాసం సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి విశ్వాసం సినిమా రిలీజ్ అవుతుంది.