తమిళ హీరోను ఆకాశానికి ఎత్తుతున్న అమరావతి రైతులు..ఎందుకో తెలుసా ?

-

ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఏడాది కాలంగా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం ఒక వర్గం వారు లేదా ఒక పార్టీ వారు చేస్తున్నారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇది రైతులు ఆందోళన అని కూడా వారు గుర్తించ లేదు. అలానే ఈ ఆందోళనకు టాలీవుడ్ నుంచి ఒక్క హీరో కూడా అండగా నిలిచిన పాపాన పోలేదు. కానీ ఒక తమిళ డబ్బింగ్ సినిమాల్లో అమరావతి రైతుల పోరాటం గురించి ప్రస్తావించడంతో వారు ఇప్పుడు సంతోషిస్తున్నారు.

కనీసం ఒక తమిళ హీరో అయినా మమ్మల్ని గుర్తించాడని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా మరేమిటో కాదు జయం రవి హీరోగా తెరకెక్కిన భూమి అనే సినిమా. ఈ సినిమా నిన్ననే డిస్నీ హాట్ స్టార్ యాప్ లో రిలీజయ్యింది. ఆర్గానిక్ వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమరావతి రైతుల పోరాటం గురించి కాస్త గొప్పగా మాట్లాడారు. నిజానికి ఒక రకంగా ఇది ఆ హీరోకి ఇవ్వాల్సిన క్రెడిట్ కాదు. ఎందుకంటే డబ్బింగ్ సినిమా కాబట్టి ఇక్కడ తెలుగులోనే ఎవరో ఒక రచయిత డబ్బింగ్ డైలాగ్స్ రాసి ఉండొచ్చు. బహుశా ఆయన అమరావతి ఉద్యమాన్ని రైతుఉద్యమంగా గుర్తించి ఉండొచ్చు. ఏదైతేనేమి మొత్తానికి ఆ క్రెడిట్ మాత్రం జయంరవికి దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news