సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు ఊచ కోత కోశారు. వరి కోసినట్లే సిక్స్ లో వర్షాన్ని కురిపించారు. దీంతో లక్నో సూపర్ జెంట్స్ జట్టుపై 10 ఓవర్లలో మ్యాచ్ విజయాన్ని దక్కించుకుంది హైదరాబాద్. మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ 166 పరుగులు చేసింది.
అయితే ఆ లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే చేదించింది హైదరాబాద్ జట్టు. హైదరాబాద్ ఓపెనర్లు హెడ్ 89 పరుగులు చేయగా మరొక ఒపీనియన్ అభిషేక్ శర్మ 75 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. హైదరాబాద్ ఓపెనర్లు ఇద్దరు పోటీపడి బౌండరీలు సిక్సర్లు కొట్టారు. ఇక ఈ విజయంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.