భారతదేశపు తొలి దేశీయ 9 ఎంఎం మెషిన్ పిస్టల్ ను రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ), భారత సైన్యం సంయుక్తంగా అభివృద్ధి చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్య ప్రదేశ్ లో ఉన్న Mhow లోని ఆర్మీ యొక్క పదాతిదళ పాఠశాల మరియు పూణేలోని DRDO యొక్క ఆయుధ పరిశోధన మరియు అభివృద్ధి స్థాపన (ARDE) ఈ ఆయుధాన్ని రూపొందించి అభివృద్ధి చేశాయని చెబుతున్నారు.
నాలుగు నెలల రికార్డు సమయంలో ఈ ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఈ మెషిన్ పిస్టల్ ఇన్-సర్వీస్ 9 ఎంఎం మందుగుండు సామగ్రిని కాల్చి వేస్తుంది అని చెబుతున్నారు, 3D ప్రింటింగ్ ప్రక్రియను వివిధ భాగాల రూపకల్పన మరియు ప్రోటోటైపింగ్లో ఉపయోగించారు అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ “మెషిన్ పిస్టల్ ఉత్పత్తి ధర ఒక్కొక్కటి 50,000 కంటే తక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు.