సాధారణంగా భక్తులు ఆలయాలకు వెళ్ళినప్పుడు తమకి తోచినది భగవంతుడికి ఇస్తూ ఉంటారు. ఇలా దేవుడిని దర్శించుకోవడం, ఏదో ఒక కానుకలను సమర్పించడం మామూలే. అలానే ముడుపులు కట్టడం, నగలు చేయించడం లేదా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు విరాళాలు ఇవ్వడం కూడా చేస్తూ ఉంటారు. కొందరు అయితే ఆలయం అభివృద్ధి చెయ్యడం, కావాల్సిన సామానాల్ని ఇవ్వడం కూడా చేస్తారు. అయితే ఎలాంటి వస్తువులు సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకోండి.
చాల మంది కానుకలను ఇచ్చేస్తారు కానీ వాటి వల్ల ఏం అవుతుంది..?, ఎటువంటి పుణ్యం వస్తుంది..? అనేది తెలియదు. అయితే మరి ఎలా వాళ్ళకి మంచి కలుగుతుందో ఏ పుణ్యం వస్తుందో ఇప్పుడే చూడండి. ఈ విషయం లోకి వస్తే.. ఆలయంలో ఉన్న గోడలకు సున్నం వేయించి ఆలయ ప్రాంగణాన్ని అందంగా మార్చితే.. వాళ్లకి శ్రీ మహా విష్ణువు లోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉంటె ఆలయానికి శంఖం దానం చేయడం వల్ల విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది.
దేవాలయానికి గంటను దానం చేసే వారి జీవితం లో ఉన్నత స్థాయి లో ఉంటారు. మువ్వలను, గజ్జలను దానం చేస్తే సౌభాగ్యాన్ని పొందగలరు. అదే ఎవరైనా ఆలయ ప్రాంగణం లో పందిళ్లను నిర్మిస్తే…. అలాంటి వారికి ధర్మ బుద్ధి కలగడానికి కారణమవుతాయి.సర్వత్ర ఉత్తమ స్థానం లభించాలంటే దేవుడికి ఆసనాన్ని సమర్పించాలి. ఈ ప్రకారం చేసిన దానాలకి పుణ్యం ఈ విధంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.