వ్యంగ్యంగా మాట్లాడితే వెంటబడి తరిమి కొడతారు.. ఏపీ మంత్రికి టీడీపీ నేత వార్నింగ్ !

-

మంత్రి బుగ్గనపై ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానాన్న కేఈ మాదన్నను మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తండ్రి నాన్న అనేవారని, కానీ మంత్రి బుగ్గన మా నాన్న గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి హోదాలో ఉన్న బుగ్గన పెద్దలను గౌరవించేలా నడుచుకోవాలని అన్నారు. వ్యంగ్యంగా మాట్లాడటానికి ఇది అసెంబ్లీ కాదు, డోన్ నియోజకవర్గం అని అన్నారు. పెద్దలను గౌరవించకుండా వ్యంగ్యంగా, వెకిలి చేష్టలతో మాట్లాడితే డోన్ వైపు చూడకుండా ప్రజలు  వెంటబడి నిన్ను తరిమి కొడతారని అన్నారు.

కేఈ మాదన్నపై కామెంట్లు చేసే స్థాయికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎదగలేదన్న ఆయన మానాన్న దగ్గర కాళ్లు, వేళ్లు పట్టుకుని సర్పంచ్ ఓట్లు వేయించుకున్న సంఘటన మంత్రి బుగ్గన మర్చిపోవద్దని అన్నారు. ఎన్నో ఏళ్లు సర్పంచిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి డోన్ కు ఏమి చేశారో చెప్పాలని అన్నారు. కేఈ ప్రతాప్ కోట్ల రూపాయలతో డోన్ ను అభివృద్ది చేస్తారని ఏ చిన్న సంఘటన జరిగినా డోన్ కు నేనొస్తానని అన్నారు. కార్యకర్తలు నా వెంట ఉంటే నా సత్తా ఏంటో చూపిస్తానన్న ఆయన గతంలో డోన్ నుంచి డిప్యూటేషన్ మీద పత్తికొండకు వెళ్లానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news