జగన్ బర్త్ డేకు ఆర్జివి గిఫ్ట్..!

-

వర్మ శిష్యుడు జగన్ ఉన్నాడుగా అదేనండి పూరి జగన్నాథ్ అతని బర్త్ డేకి అనుకుంటే పొరపాటు పడినట్టే. జగన్ అనగానే గుర్తొచ్చే వైసిపి అధినేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే ఇక్కడ ప్రస్థావించేది. ఇంతకీ వై.ఎస్ జగన్ బర్త్ డే కి వర్మకు సంబంధం ఏంటి అంటే.. డైరెక్ట్ గా లేకున్నా ఇన్ డైరెక్ట్ గా అలా కుదిరేసింది. ఎన్.టి.ఆర్ బయోపిక్ ఛాన్స్ తనకే వస్తుందని కలలు కన్న ఆర్జివి ఆ సినిమా తేజ చేతుల మీదగా క్రిష్ దగ్గరకు వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నాడు.

అందుకే ఎన్.టి.ఆర్ బయోపిక్ కు జోడీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అనే సినిమా మొదలుపెట్టాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ కు సంబందించి ఎలాంటి అప్డేట్ వచ్చినా దాని వెంటనే తన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అప్డేట్ ఇస్తున్నాడు వర్మ. ఈ క్రమంలో డిసెంబర్ 21న ఎన్.టి.ఆర్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. యాదృచికమో ఏమో కాని ఆ రోజు జగన్ బర్త్ డే కావడం విశేషం. అందుకే ఎన్.టి.ఆర్ కు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ వెన్నుపోటు సాంగ్ ను అదే రోజు రిలీజ్ చేస్తున్నాడు ఆర్జివి.

సినిమాను కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండో పార్ట్ కథానాయకుడు రిలీజ్ డేట్ నే ఫిక్స్ చేశాడు వర్మ. కాని మహానాయకుడు అనుకున్న టైంకు రావడం కష్టమే అని తెలుస్తుంది. ఆ సినిమా మరో రిలీజ్ డేట్ ఫిబ్రవరి 7 అంటున్నారు. మరి తన సినిమాకే ఎన్.టి.ఆర్ ఆశీస్సులు ఉంటాయని చెప్పిన వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో ఎలాంటి హడావిడి చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news