పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాలుగు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదిగాక ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్లో చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఐతే కేజీఎఫ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమాపై ఆసక్తి బాగా పెరిగింది. మొన్నటికి మొన్న సలార్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది కూడా. మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ మొదలుకానుంది.
ఈ నేపథ్యంలో సలార్ సినిమాలో ప్రభాస్ పక్కన కనిపించే హీరోయిన్ ఎవరా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సలార్ సినిమాకి కేజీఎఫ్ తరహా ప్లానే ఉపయోగిస్తున్నారని తెలిసింది. కేజీఎఫ్ లాగే సలార్ సినిమాలోనూ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోనున్నారట. మరి ఈ వార్తలు నిజమైతే ప్రభాస్ పక్కన నటించే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి.