వ్యాక్సిన్‌ వికటించి ఆశ కార్యకర్తకు బ్రెయిన్‌ డెడ్‌..?

-

కరోనా మహమ్మారి కట్టడికి వచ్చిన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ధైర్యం నింపుతుండగా.. అక్కడక్కడ వికటిస్తున్నట్లు వార్తలు రావడంతో కాస్త భయాందోళన కలుగుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వికటించి ఓ ఆశ కార్యకర్తకు బ్రెయిన్‌ డెడ్‌ కాగా.. మరో ఏఎన్‌ఎం అస్వస్థతకు గురై కోలుకుంటన్నట్లు సమాచారం.

గుంటూరు జిల్లా.. తాడేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎం) గొట్టిముక్కల లక్ష్మి (38), మరో ఆశ కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42) ఇద్దరికి బుధవారం కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేశారు. కాసేపటికి ఏఎన్‌ఎం లక్ష్మికి తలనొప్పి వచ్చి వెంటనే ఫిట్స్‌ రాగా.. విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో సృహ కోల్పోయింది. అప్రమత్తమైన అధికారులు వారిద్దరినీ జీజీహెచ్‌లో చేర్చించారు. ఆందోళనతో∙ఏఎన్‌ఎం లక్ష్మికి రియాక్షన్‌ వచ్చిందని, చికిత్స అందించిన వెంటనే ఆమె సాధారణ స్థితికి చేరుకుని డిశ్ఛార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉందని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు.

ఆశ కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌కు గురైనట్టు తేల్చారు. శనివారం రాత్రి ఆమెకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు సమాచారం. అయితే.. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. విజయలక్ష్మికి వేసిన వయల్‌ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా అతనికి ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోవడం గమనార్హం. డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌ జీజీహెచ్‌కు చేరుకుని ఇరువురి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news