మద్యంతో పాటు వీటిని తింటున్నారా…? అయితే ఈ ముప్పు తప్పదు…!

-

చాల మంది వివిధ కారణాల వల్ల మద్యం తాగుతారు. కొందరు అయితే మద్యం మత్తు లో తేలుతూ ఉంటారు. కారణం ఏమైనా ఈ పద్దతి మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. చాల మంది మద్యం తీసుకునేటపుడు ఏదైనా తింటూ ఉంటారు. కానీ ఈ పదార్ధాలు తింటే కొన్ని సమస్యలు వస్తాయి. అయితే మరి ఆ సమస్యలు ఏమిటి…? ఎటువంటి ప్రమాదం కలుగుతుంది..? ఇలా అనేక విషయాలని చూసేయండి.

వివరాల లోకి వెళితే… మద్యం సేవిస్తూ వేరుశెనగ మరియు పొడి జీడిపప్పు తింటే… గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వేరుశెనగ మరియు జీడిపప్పు లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఆల్కహాల్ తాగుతూ వీటిని తినే అలవాటు ఉంటె మానుకోండి. అలానే మద్యం తో పాటు పాలతో చేసిన వస్తువులను తినడం మంచిది కాదు. జున్ను వగైరా వాటిని తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

సోడా లేదా కూల్ డ్రింక్స్‌తో మద్యం తో సేవించవద్దు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆయిల్ ఫుడ్ కూడా తీసుకోవడం మంచిది కాదు. కడుపులో గ్యాస్ మరియు కడుపు లో మంట లాంటి సమస్యలు తలెత్తవచ్చు. కనుక మద్యం తాగేవారు వీటిని మద్యం తో పాటు తీసుకోకండి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news