అంతరిక్షం రివ్యూ & రేటింగ్

-

మెగా హీరో వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అంతరిక్షం. క్రిష్, రాజీవ్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదిరి రావు హైదరి కలిసి నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇండియన్ స్పేస్ సెంటర్ లో పనిచేసే దేవ్ (వరుణ్ తేజ్) తను సిద్ధం చేసిన విప్రయాన్ శాటిలైట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అవడంతో స్పేస్ సెంటర్ వదిలి వెళ్తాడు. అయితే ఇండియన్ స్పేస్ సెంటర్ వారు కొత్తగా రిలీజ్ చేసిన మిహిర శాటిలైట్ ట్రాక్ తప్పడంతో ప్రపంచ కమ్యునికేషన్ వ్యవస్థ నాశనం అవుతుందని తెలుస్తుంది. 12 ఏళ్ల క్రితం మిహిర శాటిలైట్ ప్రోగ్రాం డీకోడ్ చేయడం కేవలం దేవ్ వల్లే సాధ్యమని ఇండియన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ అతన్ని పిలిపిస్తాడు. రియా (అదిరి రావు) వెళ్లి తామేశ్వరం లో ఉన్న దేవ్ కు విషయం చెబుతుంది. ఇంతకీ దేవ్ వెళ్లి మిహిర శాటిలైట్ ప్రాజెక్ట్ సాల్వ్ చేశాడా..? విప్రయాన్ శాటిలైట్ మీద దేవ్ కు ఎందుకు అంత ప్రేమ..? దాని వెనుక ఉన్న గతం ఏంటి అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

తెలుగు తెర మీద అంతరిక్షం సినిమా.. కచ్చితంగా ఇదో గొప్ప ప్రయత్నమని చెప్పాలి. రొటీన్, మూస సినిమాలకు భిన్నంగా కొత్త ప్రయత్నాలను ఆదరిస్తున్న ఈ తరుణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్ఫెక్ట్ స్పేస్ కాన్సెప్ట్ మూవీ అంతరిక్షం. ఈ సినిమా చూసి ఎవరైనా ఇది తెలుగు సినిమా అంటే నమ్మరని చెప్పేలా ఉంది.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి కథ, కథనాలు అద్భుతంగా రసుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఘాజి తర్వాత సంకల్ప్ రెడ్డి చేసిన మరో ప్రయత్నం అంతరిక్షం. ఈ ప్రయోగం చేయడమే ఓ సక్సెస్ అని చెప్పొచ్చు. అయితే సాధారణ ఆడియెన్స్ కు ఈ సినిమా అక్కడక్కడ బోర్ కొడుతుంది.

అయితే యూనివర్స్, స్పేస్ కాన్సెప్ట్ ఇలా కాస్త కొద్దిగా మెదడికి పదును పెట్టి ఆలోచిస్తే మాత్రం ఈ సినిమా ఓ గొప్ప ప్రయత్నంగా అనిపిస్తుంది. కచ్చితంగా ఈ అటెంప్ట్ కు తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. అయితే ఫస్ట్ హాఫ్ వేగంగా నడిపించి వాట్ నెక్స్ట్ అనే క్యూరియాసిటీగా అనిపించేలా చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ చేశాడని అనిపిస్తుంది.

ఎలా చేశారు :

దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ మరోసారి అదరగొట్టాడు. ఇలాంటి కథలను ఓకే చేసి హీరోగా ఓ మెట్టు ఎక్కాడు వరుణ్ తేజ్. హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, అదిరి రావుల నటన మెప్పించింది. అవసరాల శ్రీనివాస్, రహమాన్, సత్యదేవ్, రాజులు తమ నటనతో ఆకట్టుకున్నారు. వరుణ్, లావణ్యల లవ్ సీన్స్ బాగున్నాయి.

టెక్నికల్ గా ఈ సినిమా చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణమని చెప్పొచ్చు. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ బాగుంది. బిజిఎం ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సిజి వర్క్ మెప్పించింది. కథ, కథనాల్లో దర్శకుడు సంకల్ప్ మరోసారి తన ప్రతిభ చాటాడు.

ప్లస్ పాయింట్స్ :

డైరక్షన్

లీడ్ కాస్ట్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో అవడం

క్లైమాక్స్

బాటం లైన్ : అంతరిక్షం అదిరింది కాని..!

రేటింగ్ : 2.75/5

Read more RELATED
Recommended to you

Latest news