ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్

-


తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ నెల 23నుంచి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాళ్,ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. సీఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఈ నెల 23న ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖకు బయల్దేరతారు. విశాఖలోని శారద పీఠాన్ని సందర్శించి… పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్లి సీఎం నవీన్‌ పట్నాయక్‌తో కేసీఆర్‌ సమావేశం అవుతారు.

24న కోణార్క్‌, పూరీ జగన్నాథ్‌ ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం భువనేశ్వర్‌ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళ్తారు. అదే రోజు సాయంత్రం బంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఆ తర్వాత కాళీమాత దేవాలయాన్ని సందర్శించి ఢిల్లీకి చేరుకుంటారు. దీంతో ఈ నెల 25 నుంచి రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్‌ బస చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నేతలను మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్న ముఖ్యమంత్రి ‌ ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ సమావేశమవుతారు. జాతీయ స్థాయిలో భాజపా, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ వేదికను రూపొందించడంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news