టీజర్ టాక్: గుణపాఠాలు చెప్పడానికి వస్తున్న ఆచార్య..

-

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా టీజర్ ఇప్పుడే రిలీజైంది. ధర్మస్థలి తలుపులు తెరుస్తామని చెప్పిన చిత్రబృందం, ఈ రోజు ఆ చోటుకి ప్రవేశాన్ని ఇచ్చేసింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఇతరుల కోసం జీవించేవాళ్ళు దైవంతో సమానం. అలాంటి వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడితే దైవమే రావాల్సిన పనిలేదు అంటూ, చిరంజీవిని చూపించారు.

పదునైన చూపులతో మెగాస్టార్ ఎంట్రీ అదిరిపోయింది. చేతిలో ఎర్ర కండువా పట్టుకున్న తీరు అద్భుతంగా ఉంది. ఆచార్య సినిమాలో మెగాస్టార్ లుక్ స్పెషల్ గా ఉండనుందని తెలుస్తుంది. టీజర్ చివర్లో చిరంజీవి పేల్చిన డైలాగ్ పీక్స్ అనే చెప్పాలి. పాఠాలు చెప్పకపోయినా ఆచార్య అని పిలుస్తున్నారంటే గుణపాఠాలు చెప్తా అనే డైలాగ్ అభిమానులకి హుషారు తెప్పించింది. అటు వాయిస్ తో రామ్ చరణ్ అభిమానులని కూడా సంతృప్తి పర్చిన ఆచార్య టీమ్, మెగాస్టార్ తో డైలాగ్ చెప్పించి అందరినీ మెప్పించింది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news