చర్మం అందంగా కనబడడానికి ప్రతీ ఒక్కరూ పరితపిస్తుంటారు. అందులో తప్పు లేదు కూడా. దానికోసం మార్కెట్లో ఉన్న రకరకాల సాధనాలు వాడుతుంటారు. ఎవరికి నచ్చినది వారు వాడుతూ, చర్మాన్ని సురక్షితంగా ఉంచుకుంటూ అందంగా కనబడాలని అనుకుంటారు. ముఖ్యంగా ముఖంపై వచ్చే మొటిమలు, నల్ల మచ్చలు, ముడుతలు వంటివి పోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఐతే వీటిని పోగొట్టుకోవడానికి చాలా పద్దతులున్నాయి. అందులో ఒకటి కెమికల్ పీల్.
దీనివల్ల ముడుతలు పడిన చర్మాన్ని బాగు చేయవచ్చు. అలాగే మొటిమలు, నల్ల మచ్చలు వంటివి లేకుండా అందంగా కనిపించవచ్చు. ఐతే కెమికల్ పీల్ చేసుకునే ముందు చేసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలేమిటో ఇక్కడ చూద్దాం.
కెమికల్ పీల్ కి ముందు
రెటినాల్ వంటివి రెండు రోజుల ముందు నుండి వాడడం మానేయాలి. అలాగే చర్మం ఎండిపోయినట్టు కనిపించకుండా చూసుకోండి.
కెమికల్ పీల్ తర్వాత
గంటల వ్యవధిలో మాయిశ్చరైజర్ వాడుతూ చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి.
గంటకోసారి సన్ స్క్రీన్ వాడడం తప్పనిసరి. ఇంకా కావాలంటే సన్ స్క్రీన్ టాబ్లెట్స్ వాడితే బెటర్.
తొలగిపోయిన చర్మాన్ని లాగడం వంటివి చేయకుండా అక్కడ మాయిశ్చరైజర్ చేస్తే బాగుంటుంది.
కెమికల్ పీల్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి సీరమ్ అప్లై చేయడం మొదలెట్టాలి. రెండు మూడు రోజుల తర్వాత అయితే ఫర్వాలేదు.
ఇంట్లో చేసే చర్మ సంరక్షణ చర్యలకు కొద్ది రోజులు దూరం ఉండాలి. ఇవి పాటిస్తూ ఉంటే రెండు మూడు వారాల్లో చనిపోయిన చర్మ కణాల స్థానాల్లో కొత్త చర్మ కణాలు పుట్టుకొస్తాయి.