వీడియో వైరల్: కదిలే రైలు ఎక్కేందుకు ప్రయత్నం.. చివరికీ..!

-

కరోనా సమయంలో ఎన్నో ఘటనలు చూసే ఉంటాం. ఆ సమయంలో కరోనా వారియర్స్ గా డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ఎనలేని సేవలు చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ముఖ్య భూమిక పోషించారు. అయితే కరోనా సమయంలో రవాణా వ్యవస్థను నిలిపివేశారు. రైల్యే వ్యవస్థను కూడా కొద్ది నెలలపాటు నిలిపివేశారు. అన్ లాక్ ప్రక్రియ తర్వాత రైల్వేలు ప్రారంభం అయ్యాయని అందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం మంది రైల్వే ప్రయాణాలకు మొగ్గు చూపుతుంటారు. కానీ కొందరూ రైల్వే నిబంధనలు అసలు పాటించరూ. తొందరపాటు వల్ల ప్రాణాలపై తీసుకున్న ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.

train

కదులుతున్న రైలులో ఎక్కడం అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి కాలుజారినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇలా కదులుతున్న రైలులోకి ఎక్కి ప్రాణాలపై తీసుకున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి కింద పడ్డాడు. అలా అదుపు తప్పి కిందపడ్డాడు. రైలుకి, ప్లాట్ ఫాంకి ఉన్న గ్యాప్ లో అతడు జారిపోతున్నాడు. ఇంతలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీ ఎప్) పోలీసులు శరవేగంతో వచ్చి అతడిని బయటకు లాగాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

 

మహారాష్ట్రలోకి కల్యాణ్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన సంభవించింది. బాధితుడు పంజాబ్ కి వెళ్లే రైలును ఎక్కుతుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఆర్ పీ ఎఫ్ పోలీసు ఓ వ్యక్తిని ప్రమాదం నుంచి కాపాడిన ఫుటేజీని తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఆ పోలీసు అధికారిని నెటిజన్లు ప్రశంసలతో పొగిడేస్తున్నారు. అధికారులు కూడా శెభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news