మీ స్నేహితుల్లో ఇలాంటి లక్షణాలున్నాయా? ఐతే వెంటనే వారితో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టండి.

-

స్నేహితులనేవారు మన మంచిని కోరుకోవాలి. మన మంచిని కోరుకునే వారే స్నేహితులుగా గుర్తింపబడతారు. అలా కాని పక్షంలో వారిని స్నేహితులని పిలవరు. ప్రస్తుత జెనరేషన్లో స్నేహం అంత స్ట్రాంగ్ గా ఉంటుందా అంటే చెప్పలేం. అసలు స్నేహితులకి ఉండే లక్షణాలు ఉంటున్నాయా అన్నదీ అనుమానమే. అదంతా పక్కన పెడితే మీ స్నేహితుల్లో కింది లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారితో స్నేహం మానేయండి. ఆ లక్షణాలేంటో ఇక్కడ చూడండి.

తాను చేసిన తప్పులని ఒప్పుకోనివారితో స్నేహం చేయకండి. తప్పని తెలిసినా ఒప్పుకోని వారితో స్నేహం ప్రమాదకరం. వారెప్పుడూ అవతలివారి మీద నిందలు వేయాలనే చూస్తారు.

ఎదుటివారిని క్షణంలో జడ్జ్ చేసే వారితో దూరంగా ఉండండి. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారనేది ఎవ్వరికీ తెలియదు. అలాంటప్పుడు ఒక సంఘటన ఆధారంగా ఎదుటి వారు ఇలాంటి వారని డిసైడ్ అవ్వడం ఎంత వరకు కరెక్ట్. అందుకే తొందరగా జడ్జ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి.

మీరు చెప్పేది వినకుండా లొడలొడా వాగేవాళ్లతో అస్సలు స్నేహం చేయవద్దు. ముందే చెప్పినట్టు ఇలాంటి వారే తప్పులని ఒప్పుకోరు.

ఒక గుంపులో ఎప్పుడూ తామే లైమ్ లైట్ లో ఉండానుకునేవారితో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. వారి వల్ల మీకు ఎలాంటి లాభం లేదు.

వారి మాటల్లో మాటల కంటే కోపాలు, అహాలు కనిపిస్తే వారితో దూరంగా ఉండండి. వారెప్పుడూ వారి అహం పరిధిలోనే జీవిస్తారు.

ప్రతీదీ నెగెటివ్ గా ఆలోచించేవారితో ఉండకండి. వారితో ఉంటే మీరు ఒక్క పనికూడా చేయలేరు.

చిన్న చిన్న విషయాలకే చిరాకు పడేవారు అత్యంత ప్రమాదకరం. వారు మీ ముడ్ ని పాడుచేయడానికి రెడీగా ఉంటారు.

అది నిజమో కాదో తెలియకపోయినా గాసిప్స్ పట్టుకుని ప్రచారం చేసే వారితో స్నేహం మంచిది కాదు. మీ గురించి ఏ విషయమైనా తెలిస్తే బయటవారికి చెప్పడానికి రెడీగా ఉంటారు.

మీ తప్పులని దెప్పిపొడిచే వారితో అస్సలు వద్దు.

తమ గురించి తాము బాగా షో చేసుకునే వాళ్లతో ఉండకండి. వాళ్ళు అవతలి వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోరు.

Read more RELATED
Recommended to you

Latest news