కేంద్రానికి రాకేష్ టికాయిత్ పరోక్ష హెచ్చరికలు..!?

-

– మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్
– పంటకు కనీస మద్దతు ఇవ్వాలి
– వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి
– స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి
– అరెస్ట్ చేసిన రైతులను వెంటనే రిలీజ్ చేయాలి
– భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయిత్

హరియాణా: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే కేంద్రం గద్దె దిగడం ఖాయమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయిత్ పరోక్షంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన హరియాణా జీంద్ జిల్లాలోని ఖండేలా గ్రామంలో జరిగిన ‘మహా పంచాయత్’ సమావేశానికి హాజరయ్యారు. టేక్ రాం ఖండేలా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

rakesh
rakesh

ఈ సందర్భంగా టికాయిత్ మాట్లాడుతూ.. రైతుల ఆందోళన కొనసాగితే కేంద్ర ప్రభుత్వం తన పూర్తి అధికారాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంటుందన్నారు. చట్టాల రద్దుపై ప్రభుత్వం మాట్లాడకపోతే.. యువత అధికారం నుంచి దించుతారని హెచ్చరించారు. రైతులు రాకుండా చేసేందుకు ప్రభుత్వం రోడ్లపై మేకులు, మొనలు, సిమెంట్ దిమ్మెలను అడ్డంగా పెట్టడం కరెక్ట్ కాదన్నారు. రోడ్లపై పాతిన మేకులపై నేను పడుకుంటానని.. నా పైనుంచి దాటుకుంటూ కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. ఖాప్ పంచాయతీల మద్దతు చూస్తే త్వరలోనే విజయం సాధిస్తామన్నారు. శాంతియుతంగానే ఆందోళన చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు.

పంజాబ్ రైతులు పాత్ర ప్రత్యేకమైనదని టికాయిత్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, హరియాణా రైతులు అండగా ఉంటారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రైతులతో నేరుగా సమావేశమై మాట్లాడాలన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, పంటకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. స్వామినాథన్ కమిషన్ ను అమలు చేసి.. అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులకు మద్దతుగా ఢిల్లీలోని మండీ హౌస్ వద్ద వివిధ సంఘాల నాయకులు ప్రదర్శన ర్యాలీని నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద ఊరేగింపునకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జెండాలు, ప్లకార్డులను ప్రదర్శించారు. కాగా, టికాయిత్ ప్రసంగిస్తున్న సమయంలో వేదిక కూలింది. తాత్కాలికంగా ఏర్పాటు చేయడం.. వేదికపై ఎక్కువ మంది ఉండటంతో కూలినట్లు రైతులు చెబుతున్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news