స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసం. ఎస్‌బీఐ తన కస్టమర్లకు కొత్త సేవలు అందిస్తోంది. దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ కస్టమర్లకి తమ ఇంటికే డబ్బులని పంపిస్తుంది. ఇలా మీరు బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటికి డబ్బులు పొందవచ్చు. అయితే మరి ఈ సర్వీస్ ఎలా పని చేస్తుంది..?, ఎవరికి అందుబాటు లో ఉంటుంది. ఇలా అనేక విషయాలు మీకోసం.

వివరాల లోకి వెళితే… డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు కేవలం 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి మాత్రమేనాని ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ సర్వీసుని కనుక మీరు పొందాలంటే… దీని కోసం బ్యాంక్ అకౌంట్ కేవైసీ పూర్తయ్యి ఉండాలి. అలానే బ్యాంక్ అకౌంట్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి గమనించండి. ఈ నిబంధలను కనుక అనుసరిస్తే ఈ డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఈజీగా పొందొచ్చు.

ఇది ఇలా ఉండగా ఈ డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ సేవల్లో భాగంగా కస్టమర్లు రూ.1000 నుంచి రూ.20 వేల వరకు డబ్బులను ఇంటి వద్దనే పొందొచ్చు గమనించండి. కస్టమర్లు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి డోర్ స్టెప్ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇంటి వద్దనే డబ్బులని తీసుకోవచ్చు. వాటే ఆఫర్ కదా..? ఒకవేళ బ్యాంక్‌కు వెళ్లకుండానే డబ్బులు పొందాలని అనుకుంటే ఎస్‌బీఐ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news