తెలంగాణలో వరుసగా చిరుతల సంచారం కలకలం రేగుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో చిరుత సంచారం ఇప్పుడు సంచలనంగా మారింది. గత రెండు నెలలుగా పలు గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
ఓ వ్యక్తి పద్మాజివాడి క్రాస్ రోడ్ నుంచి గాంధారికి వెళుతుండగా ఆయన కారుకు చిరుత అడ్డం వచ్చినట్టు తెలుస్తోంది. అలాగె చిరుతను ప్రత్యక్షంగా చుసి భయాందోళనకు గురై కారు పక్కనుంచి బైక్ మీద పోతంగల్ కు చెందిన మరొ వ్యక్తి వెళ్లినట్టు గుర్తించారు. అదే కాక మహబూబ్ నగర్ దేవరకద్ర మండలం వెంకటాయపల్లి శివార్లలో చిరుత కలకలం రేగింది. వ్యవసాయ పొలం వద్ద వెంకటయ్య అనే రైతుకు చెందిన ఆవు దూడ పై కూడా చిరుత దాడి చేసి చంపినట్టు తెలుస్తోంది.