మోటోరోలా కంపెనీ మోటో ఇ7 పవర్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెసర్‌ను అమర్చారు. 4జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 64జీబీ స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌కు వెనుక వైపు 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
మోటో ఇ7 పవర్ ఫీచర్లు…
* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెసర్, 2/4 జీబీ ర్యామ్
* 32/64 జీబీ స్టోరేజ్, 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఆండ్రాయిడ్ 10, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* గూగుల్ అసిస్టెంట్ బటన్, వాటర్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
మోటో ఇ7 పవర్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధఱ రూ.7499 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,299గా ఉంది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ లో విక్రయిస్తారు.