పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈశాన్య భారతం నుండి తెలంగాణ, కర్నాటక మీదుగా మరో ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో ఈరోజు, రేపు ఏపీలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ రెండింటి ప్రభావంతోపాటు సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల దట్టంగా మేఘాలు ఆవరించాయి. పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురిశాయి.దీంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడిన వర్షం పడే చాన్స్ ఉందని వెల్లడించింది. ఇక ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో చల్లటి గాలులు వీస్తున్నాయి. ఈ తెల్లవారు జామున చలి తీవ్రత ఇంకా పెరిగింది.