తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ పదవికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నా సరే ఆయనను ఎంపిక చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వడం లేదు. కానీ ఆయన విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఎంత మాత్రం కూడా సానుకూలంగా లేరు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆయనతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉన్నా సరే చాలామంది నేతలు ఆసక్తి చూపించడం లేదు. అయితే త్వరలోనే రేవంత్ రెడ్డి తో కొంతమంది కీలక నేతలు చర్చ జరిపే అవకాశాలు ఉండవచ్చు అనేది కాంగ్రెస్ వర్గాల మాట. ఇప్పటికే ఆయనతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చలు జరిపాయి. రేవంత్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకు స్పష్టంగా చెప్పింది.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తో కలిసి ఉండడానికి కొంతమంది సీనియర్ నేతలు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఆయనతో ఇబ్బంది ఉండే నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఒకవేళ ఆయనతో కలిసి నడవాలి అనుకున్న వాళ్లు మాత్రం ఆయనతో కలిసి నడుస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పారని కూడా అంటున్నారు. అయితే ఆయనతో కలిసి వెళ్ళని నేతల మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనేది టీ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడమే కాకుండా కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టవచ్చు అని తెలుస్తోంది.