లైవ్ రిపోర్టింగ్‌కు ఏదో ఒక అంతరాయం కలుగుతుంది. కానీ ఇక్కడ ఏకంగా కుక్కపిల్ల వీడియో మధ్యలో వచ్చి హల్ చల్ చేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారి లక్షల్లో వ్యూస్ వచ్చేశాయ్.. అమెరికాలోని వర్జీనియాలో మంచు వాతావరణం ఫాక్స్ 5టీవీ రిపోర్ట్ బాబా బర్నార్డ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఓ కుక్కపిల్ల ఎంట్రీ ఇచ్చింది. ఆ కుక్క పిల్లను ఈ వీడియోను యూట్యూబ్‌లో లక్షలాది మంది చూశారు. నెట్టింట ఈ క్లిప్పింగ్ వైరల్‌గా మారింది.
ఉత్తర వర్జీనియాలో గత కొన్ని వారాలుగా విపరీతంగా మంచు కురుస్తోంది. దీనిపై బాబ్ రిపోర్టింగ్ ఇస్తున్నాడు. అదే సమయంలో సమీపంలోని ఇంటి నుంచి కుక్కపిల్ల అతడి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది. దీంతో బాబ్ దాన్ని ఎత్తుకున్నాడు. వెంటనే రిపోర్టింగ్ అంశాన్ని మార్చేసి ఇలా అన్నాడు.. “ఇప్పటి వరకు స్థానికులతో చర్చించిన విషయాలు మర్చిపోండి. ఇప్పుడు ఈ కుక్క గురించి తెలుసుకుందాం.” అంటూ అతడు కాసేపు మాట్లాడాడు. దీంతో స్టూడియోలో వారంతా నవ్వుకున్నారు. కాసేపటికి అతడి వద్దకు ఒక యువతి పరుగెత్తుకుంటూ వచ్చి.. ఇంటి నుంచి కుక్కపిల్ల బయటకు వచ్చిందని దాని పేరు పిరోగి అని చెప్పింది. బయటకు వచ్చిన కుక్కను పట్టుకునేందుకు తన ఇంటి ఫెన్సింగ్ దూకి వచ్చానని తెలిపింది. ఇదంతా లైవ్ స్ట్రీమింగ్ అని తెలిసి ఆమె ఓ క్షణం షాక్‌కు గురైంది.
వీడియోను ఆ మీడియా సంస్థ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. 11లక్షల మందికి పైగా చూశారు. 8k లైక్స్ , కొన్ని వందల కామెంట్స్ వచ్చాయి. కొందరు వ్యంగ్యంగా.. మరికొందరు నవ్వుకుంటూ కామెంట్స్ చేశారు. నీ రిపోర్టింగ్ కంటే కుక్క రిపోర్టింగ్ బాగుందని ఒకరు అంటే.. మంచు వాతావారణంలో కుక్కుపిల్ల ఆడుకోవాటనికి వచ్చిందనుకుంటా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఒకరైతే నువ్వు వెదర్ రిపోర్టింగ్‌కు వెళ్లావా.. కుక్కతో ఆడుకోవటానికి వెళ్లావా అంటూ చమత్కారంగా కామెంట్ చేశారు. అయితే కొందరు గతంలో కూడా లైవ్ రిపోర్టింగ్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయని చర్చించుకున్నారు.