చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. రుతువు మారినప్పుడల్లా ఈ సమస్యలు ఒక్కోలా విజృంభిస్తుంటాయి. అందుకే చర్మ సమస్యల నుండి బయటపడడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఐతే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, చర్మ సమస్యలకి కారణం వాతావరణంలో కలిగే మార్పులే అనుకుంటారు. కానీ మన శరీర ప్రక్రియ సరిగ్గా జరక్కపోతే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు వస్తాయని తెలియదు. ముఖ్యంగా మలబద్దకం ద్వారా ఈ సమస్యలు దరి చేరతాయని తెలియదు.
అవును. మీరు చదువుతున్నది నిజమే. మలబద్దకం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారిపోవడం, జుట్టు తన మృదుత్వం కోల్పోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. వీటి నుండి దూరంగా ఉండాలంటే మలబద్దకం సమస్య నుండి దూరం కావాలి. దానికోసం చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసుకుందాం.
చేయాల్సిన పనులు
సూప్, కిచిడి వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. స్వీట్ పొటాటోలో పీచు పదార్థాలు కావాల్సినంత ఉంటాయి.
బెండకాయ, అవిసె నూనె ఆరోగ్యానికి మంచివి. వీటి ద్వారా చేసిన ఆహారాలను తీసుకోవాలి.
వెచ్చని పాలు, నెయ్యి, పసుపు వంటి వాటిని భోజనంలో భాగంగా చేసుకోవాలి.
గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలి. ఇవన్నీ మలబద్దకం ఏర్పడకుండా చేసేవి.
చేయకూడని పనులు
పొడిబారిన స్నాక్స్, అంటే పాప్ కార్న్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
కార్బోనేట్లు కలిగిన పానీయాలని తాగవద్దు.
చల్లని పదార్థాలైన ఐస్ క్రీమ్, ఫ్రిజ్ లోంచి తీసిన నీరు తాగకూడదు.