దేశవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్ ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అలాగే గ్యాస్ సిలిండర్ల ధర విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. దీని కారణంగా మధ్య తరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో భారీగా గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంపై అసహనం వ్యక్తం అవుతుంది అనే చెప్పాలి.
అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే విషయంలో దృష్టి పెట్టకపోవడం పట్ల ఆగ్రహం ఉంది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
కర్నూలులో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. లేకపోతే చిత్తూరు జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కర్నూల్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కొన్ని హామీలు రాహుల్ గాంధీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కూడా ఇప్పుడు కర్నూల్ నుంచి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు టార్గెట్గా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేయనుంది.