ఢిల్లీలో రైతుల ఉద్యమం @ 100 రోజులు

-

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుతో రైతుల ఉద్యమం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకుంది. తీవ్రమైన చలిని తట్టుకుంటూ రైతులు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతాల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా, పల్వాల్ ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు.

రైతుల ఆందోళన
రైతుల ఆందోళన

అయితే తాజాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నేడు ఢిల్లీ శివారు ప్రాంతంలోని కుంద్లి, మనేసర్, పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ హైవేను 5 గంటలపాటు దిగ్బంధించనున్నారు. అందరూ రైతులు రోడ్డుపై వెళ్లి రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని విరమించుకోమన్నారు. రైతులు న్యాయం జరిగేంత వరకూ పోరాడుతూనే ఉంటామన్నారు.

ఉద్యమం ప్రారంభించి 100 రోజులు పూర్తి చేసుకుందని ఎస్‌కేఎం నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ఈ సందర్భంగా నేడు ‘బ్లాక్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇప్పటివరకు లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధించనప్పటికీ రైతుల్లో ఐక్యతను పెంచడంలో ఈ ఉద్యమం ఎంతో కీలకపాత్ర పోషించిందని రైతు సంఘ నేత యోగేంద్ర యాదవ్ అన్నారు. యువ రైతుల వల్లే ఈ ఉద్యమంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, యువత వల్లే ఇంకా ఈ ఉద్యమం నిలబడుతోందని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ నేత కవిత కురుగంటి తెలిపారు. నేడు నిర్వహించబోయే బ్లాక్ డే కార్యక్రమానికి ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలన్నారు. కేఎంపీ ఎక్స్‌ప్రెస్ హైవేను 5 గంటలపాటు దిగ్బంధించి.. కేంద్ర ప్రభుత్వానికి మన సమస్య మరోసారి తెలిసేలా చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news