మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు తీసుకునే ప్రసాదాలు..

-

మహా శివరాత్రి.. ఈ సంవత్సరం మార్చి 11వ తేదీన వస్తున్న ఈ పర్వదినాన్ని మహా సంబంరంగా జరుపుకుంటారు శివ భక్తులు. హిందూ నెలల ప్రకారం ఫాల్గుణ క్రిష్ణ పక్షం 13, 14వ రోజున జరుపుకునే పండగే ఈ మహా శివరాత్రి. ఒక సంవత్సరంలో శివరాత్రి చాలా సార్లు వస్తుంది. కానీ మహాశివరాత్రి మాత్రం ఒక్కసారే వస్తుంది. ఈ రోజున శివ భక్తులందరూ శివాలయాలకు వెళ్ళి, పూజలు చేసి ఉపవాసాలు ఉంటూ భక్తి శ్రద్ధలతో శివున్ని పూజిస్తూ, రాత్రి మొత్తం మెళకువగానే ఉండి, శివ భజన చేస్తూ తన్మయత్వం పొందుతూ ఉంటారు.

భోళా శంకరుడిగా పిలవబడే శివుడికి తమ కోరికలు చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. ఐతే ఈ రోజున ఉపవాసం ఉండడం అనేది చాలా మందికి ఇష్టమైన ప్రక్రియ. సాధారణంగా ఉపవాసాలంటే గిట్టని వారు సైతం శివుడి కోసం ఉపవాసం ఉంటారు. మరి ఉపవాసం ఉండే వాళ్ళు పూజ చేసి, తీర్థ ప్రసాదం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రసాదాలు ఏదయితే బాగుంటుందో, మీ ఇంట్లో దాన్ని ఎలా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

సాబుదాన కిచిడి

మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారికి సాబుదాన కిచిడిని మించిన ప్రసాదం లేదు. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక్కసారి రెసిపీ తెలుసుకుందాం.

సాబుదానాలని తీసుకుని నీళ్ళలో శుభ్రపరచాలి. కొద్దిసేపు వాటిని అలాగే నానబెట్టాలి. ఆ తర్వాత ఒక గంట పాటు వాటిని పక్కన పెట్టాలి. నీళ్ళు పూర్తిగా పోయిన తర్వాత ఒక బట్టమీద ఆరెబెట్టినట్టు చేయాలి.

ఆ సాబుదానాకి పల్లీలు, ఉప్పు, కారం తగినంతగా కలుపుకోవాలి.

నెయ్యిని బాగా వేయించి అందులో జీలకర్ర, కరివేపాకు వేయాలి ఆ తర్వాత సాబుదానాని పాత్రలో వేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి ఉడికిన తర్వాత పొయ్యి మీద నుండి దించుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news