మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలుపొందిందని బొత్స పేర్కొన్నారు. ఒకట్రెండు చోట్ల టీడీపీకి ఎక్కువ స్థానాలు వచ్చినా.. ఎక్స్ అఫిషియో ఓట్లతో వాటిని దక్కించుకుంటామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఓ చరిత్ర, అద్భుతం అని అన్నారు. సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలని చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఓటర్లు ఆదరిస్తారనే దానికి ఈ ఫలితాలే నిదర్శనం అని అన్నారు.
ఓటేయాలని కోరుతూ జగన్ ఒక్క సభ పెట్టలేదు.. మీటింగ్ నిర్వహించ లేదని, ప్రజలకు కావాల్సింది చేస్తున్నప్పుడు.. మన వైపే ఉంటారని జగన్ నమ్మకం అని అన్నారు. ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది.. మేం ప్రజా సేవకు పునరంకితం అవుతామని అన్నారు. ఇంటి గుమ్మం ముందుకే ప్రభుత్వ పథకాలను అందిస్తోన్న ఘనత వైసీపీదేనిన్ ఆయన అన్నారు. వైఎస్ హయాంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఆనాడు 90 శాతం సక్సెస్ సాధించాం.. ఆనాటికి అదే రికార్డ్ అని అన్నారు. తండ్రిని మించిన తనయుడినని జగన్ నిరూపించుకున్నారని ఆయన అన్నారు.