మూలకణాల నుంచి మానవ గుడ్ల సృష్టి : శాస్త్రవేత్తలు

-

మూలకణాలు సేకరించి దానితో మానవగుడ్లు సృష్టించడంపై పలువురు శాస్త్రవేత్తలు తమ అభిప్రాయన్ని తెలిపారు. జపనీస్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం మానవ రక్త కణాలను మూలకణాలుగా మార్చి.. అపరిపకవ్వ మానవ గుడ్లుగా తీర్చిదిద్దారు. గుడ్ల ఫలదీకరణం, శిశువు తయారు కావడం ఎంతో శ్రమతో కూడుకుందని, మానవ పునరుత్పత్తి కోసం, సురక్షితమైన గుడ్లను సృష్టించడానికి ఇంకా అనేక ప్రయోగాలు చేయాలని భావించారు. యూసీఎల్ఏ అభివృద్ధి జీవశాస్త్రవేత్త అమండర్ క్లార్క్ మాట్లాడుతూ.. ‘‘ గత గురువారం సైన్స్ జర్నల్ నివేదికను జారీ చేసిందన్నారు. ఇందులో తాము తయారు చేసిన మానవ గుడ్లకు గుర్తింపు దొరికిందన్నారు.’’

steinstory
steinstory

క్యాన్సర్ లేదా ఇతర కారణాల వల్ల వంధ్యత్వంతో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ సాంకేతిక ఎంతో ఉపయోగపడుతుందని క్లార్క్ చెప్పుకొచ్చారు. ప్రయోగశాలలో భారీగా మానవగుడ్లను ఉత్పత్తి చేయగల అవకాశం సామాజిక, నైతిక సమస్యలకు దారి తీస్తుందన్నారు. సిద్ధాంతం ప్రకారం.. మరణించిన వారి రక్తం, జుట్టు, చర్మ కణాలను నుంచి ఏదో ఒక పిల్లలు తయారవుతారనే నమ్మకం నాకుందని శాస్త్రవేత్త రోనాల్డ్ గ్రీన్ చెప్పుకొచ్చారు. కాగా, కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు మూలకణాల నుంచి గుడ్లు, శుక్రకణాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2012లో క్యోటో విశ్వవిద్యాలయంలోని మిటినోరి సైటౌ, అతని సహచరులు మూలకణాల నుంచి ఎలుక గుడ్లు, శుక్రకణాలను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఆ విధానంతోనే ఎలుక పిల్లలను పెంచారనే విషయాన్ని కూడా నివేదికలో తెలియజేశారు. కానీ, మానవులపై ఈ పరిశోధనకు ప్రయత్నించారని, కానీ విఫలం అవడంతో ప్రయోగాన్ని నిలిపివేశారని క్లార్ చెప్పుకొచ్చారు.

జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిపక్వమైన మానవ గుడ్లను తయారికి శుక్రకణాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని పిటర్ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయంలోని ప్రసూతి గైనకాలజీ, పునరుత్పత్తి శాస్త్రాల విభాగ ప్రొఫెసర్ కైల్ ఓర్విగ్ తెలిపారు. ఈ ప్రయోగం వంధ్యత్వ నివారణకు సహాయ పడటమే కాకుండా, స్వలింగ సంపర్కుల జంటల స్వంత చర్మకణాల నుంచి తయారైన గుడ్లతో పిల్లలు పుట్టడానికి వీలుంటుందన్నారు. ఈ నమూనా మార్పుకు నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. చర్మకణాల నుంచి మానవగుడ్లు, శుక్రకణాలను తయారు చేయగలిగితే మానవ పునరుత్పత్తిని మార్చే అవకాశాలు తెలుస్తాయని స్టాన్‌ఫోర్డ్ బయోఎథిసిస్ట్ హాంగ్ గ్రీలీ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news