ఏపీ గవర్నర్ ను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ సింఘాల్ లు కలుసుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా ముగించే విధంగా ఎస్ఈసీ ని ఆదేశించాలని సీఎస్ కోరినట్టు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ పై దృష్టి పెట్టాల్సి ఉందని గవర్నర్ కు అధికారులు వివరించారని చెబుతున్నారు. ప్రధానమంత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాక్సినేషన్ పై జరిగిన చర్చ నేపథ్యంలో గవర్నర్ ను సీఎస్ కలిసినట్టు చెబుతున్నారు.
అంతకు ముందు జగన్ కూడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని అన్నారు. మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నించాలని, ప్రభుత్వం తరఫున అధికారికంగా గవర్నర్‌కు, హైకోర్టుకు నివేదించాలని ఆయన ఆదేశించారు.