కరోనా రెండో దశ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

-

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ  నేపథ్యంలో వైద్య శాఖ అప్రమత్తం అయింది. జిల్లా వైద్య శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో వాక్సినేషన్ పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

కరోనా వైరస్
కరోనా వైరస్

వచ్చే వారం నుంచి మొత్తం 2 వేల సెంటర్లలో వాక్సినేషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో వెయ్యి, ప్రైవేట్ లో వెయ్యి సెంటర్లలో వాక్సినేషన్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజు 50 వేల మందికి వాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళ  కాంటాక్ట్ ల ట్రేసింగ్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. 

Read more RELATED
Recommended to you

Latest news