కళ్ళకింద చర్మం ఉబ్బినట్టుగా ఉందా? ఐతే ఈ ట్రిక్స్ పాటించండి.

-

కళ్ళకింద చర్మం ఉబ్బినట్లుగా ఉండడం ఒక రకమైన చర్మ సమస్యే అని చెప్పవచ్చు. దానికి చాలా కారణాలున్నాయి. రాత్రంతా హాయిగా నిద్రపోయి పొద్దున్న లేవగానే కళ్ళు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఆ తర్వాత , చల్లని నీటితో ముఖం కడుక్కుంటే ఉబ్బిన కళ్ళు మామూలుగా అయిపోతాయి. నీటితో శుభ్రపరుచుకున్న తర్వాత కూడా ఉబ్బినట్లుగానే ఉంటే అది సమస్యే అనుకోవాలి. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సినన్ని నీళ్ళు తాగాలి. శరీరానికి సరిపడా నీళ్ళు తాగడం చాలా ముఖ్యం.

నీళ్ళు ఎక్కువగా ఉండే కూరగాయలను ఆహారంగా తీసుకుంటే మంచిది. దానివల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది.

టీ, కాఫీ, ఆల్కహాల్, ఎనర్జీ డ్రింకుల్లాంటివి తాగవద్దు. దానివల్ల కళ్ళు ఉబ్బి అదోలా తయారవుతాయి.

కొత్తిమీరని ఆహారంలో భాగం చేసుకోండి. అది మూత్రపిండాల ద్వారా విషపదార్థాలని బయటకి పంపించివేస్తుంది.

ఉబ్బిన కళ్ళు మామూలు స్థితికి రావాలంటే,

కావాల్సిన పదార్థాలు

ఒక దోసకాయ
2సెలెరీ రెమ్మలు
ఒక టమాట
కొంచెం కొత్తిమీర
నిమ్మరసం
ఒక బత్తాయి

 

తయారీ విధానం

అన్ని కూరగాయలని శుభ్రంగా కడిగి ముక్కలుగా కత్తిరించి పెట్టుకోవాలి. వాటితో జ్యూస్ తయారు చేసి పెట్టుకోండి. ఆ తర్వాత వెంటనే జ్యూస్ తాగండి. ఈ పానీయం తాగితే కొన్ని రోజులకి కళ్ళకింద ఉబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. అలా కాకుండా ఆ ఉబ్బు తగ్గకుండా అలాగే ఉంటే, చిరాకు, దురద లాంటివి కలిగి ఇబ్బందిగా అనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిది. కళ్ళకింద ఉబ్బు అంద విహీనంగా కనిపిస్తుంది కాబట్టి ఆలస్యం చేయకపోవడమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news