విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కొద్ది సేపటి క్రితం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 125 కోట్ల వ్యయంతో రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నారు.ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంక వాసుల కష్టాలు తీరనున్నాయి. కృష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో ఈ వాల్ లేకపోవడంతో స్థానికుల ఇళ్లు నీటిలో మునిగిపోతున్నాయి.
దీంతో వరద నీరు ఇళ్లలోకి చేరకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం ఈ వాల్ నిర్మిస్తోంది. అయితే ఈ శంకుస్థాపన అయ్యాక విజయవాడ కృష్ణ లంక వారధి వద్ద విజయవాడ నుండి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను సీఎంకు మల్లాది విష్ణు పరిచయం చేశారు. అయితే అందరితో కాసేపు సీఎం ఇంటరాక్ట్ అయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అయితే సీఎంకు లెటర్ ఇచ్చి కార్పొరేటర్ పుణ్య శీల కన్నీటిపర్యంతమయ్యారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి ఆశించి భంగపడిన పుణ్యశీల అలా కంట తడి పెట్టడంతో జగన్ ఓదార్చారు.