తిరుమల దర్శనానికి వెళ్లాలనుకునే వారికి టీటీడీ చేదు వార్త

-

శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ చేదు వార్త చెప్పింది. అంటే ఒక రకంగా కరోనా ప్రభావం తిరుమల శ్రీవారి దర్శనాలపై పడింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది. రోజుకు 45 వేల మందిని మాత్రమే స్వామి దర్శనానికి అనుమతించేలా చర్యలు చేపట్టారు. అలాగే, నేటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ టోకెట్లను 15 వేలకు పరిమితం చేశారు అధికారులు.

ttd
ttd

అయితే, ఇప్పటికే ఆన్‌లైన్లో శ్రీవారి దర్శనం టికెట్లు బుక్‌ చేసుకున్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏప్రిల్‌కు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్లను ఇప్పుటికే ఆన్‌లైన్లో విడుదల చేసింది టీటీడీ. ఈ కారణంగా ముందుకు టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు అధికారులు. అయితే, నేరుగా తిరుమలకు వచ్చి టైమ్‌ స్లాట్‌ టోకెన్లు తీసుకునే వాళ్ళు తాజా మార్పుల్ని గమనించాలంటున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news