వాస్తు టిప్స్: ఈ వస్తువులతో పూజ చేస్తే ధనలక్ష్మి కటాక్షం..!

-

హిందువులకు దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిఒక్కరి ఇంట్లో ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకుని.. రోజూ పూజలు చేస్తారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ.. దేవుడిని ఆరాధిస్తారు. అయితే పూజా సమయంలో భక్తులు కొన్ని విషయాలను పాటిస్తారు. అవి చాలా ప్రవిత్రమైనవిగా, ప్రత్యేకమైనవిగా పరిగణిస్తాయి. ప్రార్థన మందిరంలో అమ్మవారికి పూజలు చేసేటప్పుడు కొన్ని రకాల పూజా సామగ్రిలతో పూజలు చేయడం, కొన్ని వస్తువులను ప్రార్థన మందిరంలో పెట్టడం వల్ల ఆ కుటుంబం ఆనందంగా, ధనలక్ష్మి వరిస్తుందని నమ్ముతారు. అయితే అలాంటి వస్తువులను మీ ప్రార్థన మందిరంలో పెట్టుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపద పెరుగుతుందని పూజారులు చెబుతున్నారు. వీటితో పూజలు చేయడం వల్ల లక్షీదేవి కటాక్షం దొరుకుతుందని తెలుపుతున్నారు. అయితే ఆ పూజా సామగ్రిల గురించి తెలుసుకుందాం.

పూజ సామన్లు

శంఖం..
ప్రార్థనా మందిరంలో శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మాతా లక్ష్మీదేవి మహాసముద్రంలో చిక్కినప్పుడు ఆమె వెంట ఒక శంఖం కూడా కనిపించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పూజ చేసిన తర్వాత శంఖారావం పూరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆ ఇంట్లోని కుటుంబీకులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా జీవిస్తారు.

సాలిగ్రామం..
సాలిగ్రామం అనేది విష్ణువు యొక్క రూపంగా పరిగణిస్తారు. దీనితో విష్ణువు ఆరాధించడం ద్వారా ఎంతో సంతోషిస్తాడని, సాలిగ్రామం, తులసి ఆకులతో భగవంతుడిని పూజించాలని పూజారులు చెబుతున్నారు. దీని వల్ల ఆయా కుటుంబాలలో సంతోషం, సంపద కలుగుతుందన్నారు.

పూజ గంట..
పూజ సమయంలో గంటకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. మంత్రాలు చదివేటప్పుడు గంటను మోగించడం వల్ల ప్రతికూల శక్తులు అదృశ్యమవుతాయని, దీని వల్ల ఇంట్లో ఉండే దుష్టశక్తులు దూరమవుతాయని పూజారులు చెబుతున్నారు. ఇంట్లో గంటను మోగించడం వల్ల పాజిటివ్ వెబ్రేషన్స్ వస్తాయంటున్నారు.

నెమలి ఈక..
చాలా మంది తమ ఇళ్లలో నెమలి ఈకలను పెట్టుకుంటుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. నెమలి ఈకలను శుభంగా పరిగణిస్తారు. శ్రీ కృష్ణుడి కిరీటంలో కూడా నెమలి ఈకలు గమనించే ఉంటారు. నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. అష్టఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి.

గంగా నీరు..
గంగానీరును అతి పవిత్రమైన నీరుగా భావిస్తారు. అందుకే ఏ దేవుడినైనా పూజించేటప్పుడు గంగానీటితో వారి కాళ్లు కడగటం ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయని పూజారులు చెబుతున్నారు. ఇత్తడి, వెండి చెంబులో గంగానీటిని ఉంచాలి. పూజ ముగిసిన తర్వాత ఆ నీటిని ఇళ్లంతా చిలకరించాలి. అప్పుడే ఇళ్లు పవిత్రంగా మారుతుంది.

కళశం..
పూజా సమయంలో కళశం తప్పనిసరిగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కళశంలో నీటిని నింపి చెట్లకు పోయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. రాగి కళశంలో నీరు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి చేకూరుతుంది. కళశంలో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news