టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అహంకారం నెత్తికి ఎక్కింది. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్క పెట్టకుండా చిలుక జోస్యం చెబుతున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ఢిల్లీ సంస్థ చేసిన్న సర్వేలో ఘోరాలు బయట పడ్డాయి. 11 నెలల కాలంలో ప్రజల్లో ఇంతలా దిగజారిపోయిన పార్టీ ఈ దేశంలో ఇంకోటి లేదు. మహేష్ కుమార్ గౌడ్ మాటల మాదిరిగానే వారి ప్రభుత్వం దిగజారింది. పొంగులేటి, శ్రీధర్ బాబు, భట్టిలు అందరూ సీఎం రేసులో ఉన్నారు అని పేర్కొన్నారు.
అయితే రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా.. సీఎంగా తీసి వేయగానే రేవంత్ రెడ్డి పార్టీ మరుతాడని మీ వాళ్ళే చెబుతున్నారు. వరంగల్ లో ప్రారంభించిన కాళోజీ కళా క్షేత్రం కేసీఆర్ గొప్ప. నీ ఇష్టం ఉన్నా ఊరు వెతుక్కో సెంటర్లో నిలబడి రైతు బంధు, రుణమాఫీ, బోనస్ 500 పడిందని అడగుదాం.. వచ్చాయని చెబితే నేను రాజీనామా చేస్తా.. లేకుంటే పీసీసీ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేస్తావా.. నా సవాల్ కు జవాబు ఇవ్వాలి. కోతల రాయుడు సీఎం రేవంత్ రెడ్డి.. వరంగల్ రైతు డిక్లరేషన్ ముంచి అక్కడే విజయోత్సవాలా అని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి.