సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ పర్యటనకు వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ పర్యటన భాగంగా కాంగ్రెస్ బహిరంగ సభకు సీఎం వచ్చారు. ఇక సీఎం సభకు హాజరు అవుతుండటంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నాయకులూ కూడా ఈ బహిరంగ సభకు వచ్చారు. కానీ నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాత్రం ఈ సభలో కనిపించలేదు.
అయితే దొంతి మాధవ రెడ్డి సీఎం సభకు డుమ్మా కొట్టడం ఇదేం మొదటిసారి కాదు. ముచ్చటగా మూడోసారి ఇలా రేవంత్ రెడ్డి సభకు నర్సంపేట ఎమ్మెల్యే హాజరు కాలేదు. దొంతి మాధవ రెడ్డి ఇంటి సమీపంలోనే ఈ కాంగ్రెస్ బహిరంగ సభ జరుగుతున్నా కూడా సభకు దూరంగా ఉన్నారు ఆయన. ఇక గతంలో రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు వచ్చినా ఆయన కలవని మాధవ రెడ్డి.. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా కూడా ఆయన వద్దకు వెళ్ళలేదు.