మజిలి ఫస్ట్ లుక్.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్..!

-

అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా నటిస్తున్న సినిమా మజిలి. నిన్ను కోరి డైరక్టర్ శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. తన మొదటి సినిమా లానే ఇది కూడా ఓ లవ్ స్టోరీగా తీస్తున్నాడు శివ నిర్వాణ. మజిలి విశాఖపట్నంలో జరిగే ఓ ప్రేమకథ.

ప్రేమించుకుని ఒకటైన హీరో హీరోయిన్ చిన్న చిన్న మనస్పర్ధలతో దూరమవుతారు. ఇలాంటి టైంలో హీరోకి ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక అప్పుడు వారి మధ్య మరింత దూరం పెరుగుతుంది. ఇలాంటి కథతో వస్తున్న ఈ మజిలి ఎలా ఉండబోతుందో చూడాలి. ఫస్ట్ లుక్ లో ప్రేమ తన్మయత్వంలో ఒకరికొకరు హత్తుకున్న పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చూస్తేనే ఓ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది.

పెళ్లి తర్వాత కథల విషయంలో జాగ్రత్త పడుతున్న సమంత చైతు సినిమా కాబట్టి ఇలాంటి కథకు ఒప్పుకుందని చెప్పొచ్చు. ఇక శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి నిరాశపరచడంతో చైతు మజిలి మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. మరి ఈ సినిమా ఈ జంటకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news