ఎక్కడ పుడతామో తెలియదు.. ఎప్పుడు, ఎక్కడ చనిపోతామో తెలియదు. అసలు ఈ జీవితమమే ఓ మాయ. అంతా మాయలో బతుకుతుంటాం మనం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంతా కలలా ఉంటుంది. ఏది నిజమో తెలియదు. ఏది కలో తెలియదు. ఈ జీవితం ఎప్పుడు ముగుస్తుందో.. ఎక్కడ ప్రారంభం అవుతుందో.. ఎక్కడికి వెళ్తామో.. ఎందుకు వెళ్తామో కూడా తెలియదు. అంతా భ్రాంతి యేనా జీవితానా బతుకింతేనా… అన్నట్టుగా ఉంటుంది జీవితం.
ఎవరికైనా ఏదైనా సాయం చేయాలంటే వాళ్లు మనకు తెలిసిన వాళ్లే అయి ఉండాలా? మన స్నేహితులో, బంధువులో.. రక్త సంబంధీకులో అయి ఉండాల్సిన అవసరం లేదు. మనకు మానవత్వం ఉంటే చాలు.
మీరు పైన చూస్తున్న ఫోటోలో చనిపోయిన వ్యక్తి పేరు శ్రీధర్ బాబు. అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఉండేవాడు. అనారోగ్యం కారణంగా చనిపోయాడు. తనకు అంత్యక్రియలు చేయడానికి ఎవరూ లేకపోవడంతో… ఆశ్రమం ఫౌండర్ శంకర్… కొంతమంది ఆదర్శమైన యువతీయువకులకు ఈ పని అప్పగించారు. వాళ్లు అతడిని తమ సొంత అన్నలా భావించి అతడికి అంత్యక్రియలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా వాళ్లు అంత్యక్రియలు నిర్వహించారు.