తెలంగాణలో పార్టీ పెట్టి చక్రం తిప్పాలని చూస్తున్న ఏపీ సిఎం వైస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల అందుకు తగ్గట్టు ప్రజా సమస్యలను టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరలోని ధర్నాచౌక్‌లో ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్ షర్మిల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. షర్మిల దీక్షను కవర్ చేయడానికి వచ్చిన మీడియా కెమెరాలను అడ్డుగా ఉన్నాయని భావించి కెమెరాలను తొలగించమని మీడియాకు షర్మిల సూచించారు.
అయితే అక్కడే ఉన్న సాక్షి ఛానెల్ ప్రతినిధులను చూసి ఆమె వారికి చురకలు అంటించారు. ‘‘కవరేజ్ చేసింది చాల్లేమా… ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ సెటైర్ వేశారు. అయితే వెంటంటే ఆమె పక్కనే ఉన్న తల్లి వైఎస్ విజయలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయి వెంటనే తేరుకుని.. షర్మిల కాలి మీద మెల్లగా చేత్తో తట్టారు. ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.